ప్రియ భగవద్ బందువులారా....
శ్రీమన్నారాయణస్మరణపూర్వకవందనాలతో ఆర్షవాణి మిమ్ములను పలుకరిస్తోంది ...
శ్రీమన్నారాయణస్మరణపూర్వకవందనాలతో ఆర్షవాణి మిమ్ములను పలుకరిస్తోంది ...
మహర్షులు మనయందు ప్రీతితో అందించిన సంప్రదాయాలను ప్రచారము చేయాలను ఆలోచనతో అవతరించినది మన ఆర్షవాణి సంప్రదాయ ప్రచార కేంద్రమ్. మొదట మన కార్యక్రమాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నగరములో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములో అక్కడి మిత్రుల ప్రోత్సాహముతో1993లో ప్రారంభ మైనవి . తరువాత ఖమ్మం జిల్లా సత్తుపల్లి , గుంటూరు , విశాఖపట్టణం ,కాకినాడ నగరాల పరిధిలో అనేక గ్రామాలలో మనకార్యక్రమాలు జరిగినవి.
- శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం చక్కగా పారాయణచేయగలుగునట్లు నేర్పించుట .(వేలమందికి నేర్పించుట జరిగినది)
- శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం ప్రచురించి పంచుట (20 వేల పుస్తకాలు ప్రచురించి ఉచితముగా పంచుట జరిగినది )
- దివ్య ప్రబందాలు నేర్పించుట .(వందమందికి నేర్పించుట జరిగినది)
- శ్రీ రామాయణము మొదలగు మన ఇతిహాసములను అద్యయనము చేయించుట .(కొద్దిమందికి నేర్పించుట జరిగినది)
- వలసపాకల (కాకినాడ దగ్గర ) లో శ్రీ రామమందిరం నిర్మింపచేయడం జరిగినది.
- భగవదారాధన విధానమును భావముతో ''భగవదారాధన కరదీపిక" అనుపేర పుస్తకం తయారుచేశాము.
- శ్రీ రామాయణము పై వచ్చిన విమర్శలకు జవాబుగా "శ్రీ రామాయణ రహస్య దీపిక'' వ్రాయడం జరిగినది .
- సంప్రదాయ ప్రచారమునకు అవకాశముననుసరించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది .
నాగురించి తరువాత ఇందులో చేర్చబడును. ముందుగా దనుర్మసోత్సవాలు చిత్రమాలికలు దర్షించండి .
తరువాత ఉగాది పంచాంగము , శ్రీరామాయణ పరిశీలనము చేర్చబడును .
శ్రీమాన్ జనార్దన రామానుజ దాసు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి