శ్రీమన్నారాయణుని  సంకల్పముచేత జగత్తు ఆవిర్భవించింది అని వేదములవలన పురాణములవలన తెలియుచున్నది.
 ''ఆదౌ నారాయణ ఏవ ఆసీత్'' అని ఋగ్వేదం,
 ''అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః'' 
అని నారాయణానువాకం.
 సంకల్పము కుడా 
''ఓం అస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః''
 అని ఉంటుంది . 
దీనిద్వారా నారాయణుడే జగాత్కారణం అని అర్ధముకాగా,
ఆ నారాయణుడు పరమపదములో ఎలా ఉంటాడో
 చూపించే చిత్రము ఇది. 
దీనిని ''తిరుమంత్ర ధ్యానమూర్తి '' అంటారు .     

వ్యాఖ్యను జోడించు
   ధర్మార్ధ కామ మోక్షములను నాలుగు పురుషార్ధములను సాధించుకొనుటకు అవసరమైన పరస్పర సహకారమును ధర్మబద్ధముగాపొందుటకు - వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు మహర్షులు . అవి 8 విధాలుగా ప్రసిద్దమయినను  వివాహములలో మొదటి 4వివాహాలు మాత్రమే ధర్మసమ్మతము . వివాహసమయము లో చదివేమంత్రములు- వివాహ ప్రాధాన్యతను ,  బాధ్యతలను , తెలియచేసేవిగా ఉంటాయి. వాటి అర్ధములను కళ్యాణ వేదికపై  వ్యాఖ్యానము చేస్తే, మన వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను ప్రచారము చేసినట్లుగా ఉంటుందని మిత్రులు కోరగా వివాహ  వ్యాఖ్యానమును  తయారుచేసి , మొట్ట మొదటిగా శ్రీమాన్ సాగర్రావ్ గారి పుత్రికావివాహ సందర్భముగా వ్యాఖ్యానము చేయడమైనది . ఆ సందర్భముగా జరిగిన సన్మాన సందర్భములో సన్మాన పత్రమిది . పంచరత్నపద్యరచన చేసినవారు- నాకు ప్రియ మిత్రులు , బహు గ్రంధకర్త , ఆకాశవాణి అవార్డు గ్రహీత శ్రీమాన్ వూసల రజనీ గంగాధర్ గారు .           

కామెంట్‌లు