గీతామృత వాణి 2
తమోగుణంచేత కొందరు ఎదుటివారిని అమాయకులని అనుకుంటారు.
వంచనతో " మేముచెప్పినదే సత్యమని" నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటారు.
అవసరమైతే ఎదుటిపక్షానికి శాంతి ఉపదేశములను చేయడానికి మధ్యస్థులైన మంచివారిని వినియోగించుకుంటారు.
ఒక్కసారి వంచనతో మధ్యస్థులను తమపక్షాన నిలబడేవిధంగా ఇరికిస్తారు.
ధృతరాష్ట్రుడి ప్రేరణతో దుర్యోధనాదులు అదేపని చేసారు.
అసలు యుద్ధమే జరుగదనీ, సిగపూవు వాడకుండా తమకుమారులకు రాజ్యము లభిస్తుంది అనుకున్నాడు... ధృతరాష్ట్రుడు.
దానికి కారణం ఉంది. భీష్ముడిని పాండవులు ఏమీ చేయరు. ఇంకవరూ జయించలేరు. మిగతా సైన్యమును భీష్ముడు సంహరించగలడు. ఇక మిగిలేది ఐదుగైరు పాండవులేగా....! వారెంతలే ...! అనుకున్నాడు. అలాంటి భీష్ముడు అంపశయ్యపై పడిపోయాడు.
"అయ్యో ...! ఇప్పుడెలా..? అసలు సంధి చేసుకుంటారనుకుంటే ఇలా జరిగింది ఏమిటి...? "అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే "ఏంచేసారు?" అని అడిగాడు.
సంజయుడు చెప్పాడు... "వ్యూహములుగా నిర్మించబడిన పాండవసేనావాహినిని చూడగానే ద్రోణాచార్యులవద్దకు రాజుగా వెళ్ళాడు దుర్యోధనుడు." అన్నాడు.
నర్మగర్భంగా "నీకుమారుడికి భయంపట్టుకుంది. కానీ గురువుదగ్గరకు రాజుగా వెళ్ళి తన తెలివితక్కువ తనం బయటపెట్టుకున్నాడు" అని అర్ధం స్పురించేటట్లు చెప్పాడు.
వీడియో చూడండి
మీ మిత్రులకు షేర్ చేయండి... భగవద్గీత రోజూ చదవండి లేదావినండి.
ఆలోచించండి....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి