అన్ని సమస్యలకూ కారణం స్మార్తులే 


అనవసరంగా అనాలోచితంగా ఈ నింద వేయడంలేదు . ఈ వ్యాసం చదవండి మీకే అర్థమవుతుంది. 

సోమరితనం తో బ్రతకడం నేర్చినవాడు సమాజానికి హాని కలిగించే ఆలోచన చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. 

బ్రాహ్మణ: జగత్తు అంతటికీ కారణమైన భగవంతునిపై విశ్వాసంతో తనకు విధించబడిన ధర్మాన్ని అనుసరించి జీవించే అందరూ బ్రాహ్మణులే. 

బ్రహ్మాణ్ అనతి ఇతి బ్రాహ్మణః బ్రహ్మమును ఉపాసించువాడు .... నిత్యం భగవంతుని తలచి జీవించే వాడు బ్రాహ్మణుడు.  సమాజం అంతా బ్రాహ్మణులే. 


సమాజమనుగడకోసం వర్గీకరణ:- సమాజమనుగడకోసం వర్గీకరణ జరిగింది.  సలహాలు సూచనలు ఇవ్వడం కోసం కొందరు,  రక్షణ కోసం కొందరు,  సంపదలను రక్షించి సమయానికి అనుగుణంగా వినియోగించడానికి కొంతమందిని . ఉత్పత్తిని చేసేవారు కొందరు.  ఏర్పాటు జరిగింది. 


సలహాలు ఇవ్వడం జ్ఞానానికి సంబంధించినదని వారిని పెద్దలుగా బ్రహ్మ అనేపదంతో గౌరవించింది. సమాజం. 

బ్రాహ్మణ అనే వ్యవస్థ:- బ్రాహ్మణ అనే వ్యవస్థ అలాతయారయ్యింది. సమాజానికి హితముచేయలని భగవంతునిచేత ఇవ్వబడిన జ్ఞానం వేదం వారిచేతికి ఇచ్చి రక్షించవలసిన బాధ్యత ఇచ్చింది సమాజం కొందరికి.  కానీ ఆవిధంగా లభించిన అవకాశం దుర్వినియోగంచేసుకుని సమాజినికి బాధాకరంగా తయారయ్యారు సోమరులైన వారు. 
బ్రాహ్మణస్య పరోధర్మః వేదానాం ధారణాపిచ।
అహింసా సత్యవచనం క్షమాచేతి వినిశ్చితం।। (మ.భారతం)
వేదమును అధ్యయనం చేయడం. హింసకు దూరంగా ఉండడం, సత్యం పలుకడం, ఓర్పు కలిగి ఉండడం బ్రాహ్మణ లక్షణాలు. ఆ లక్షణాలు కలవారంతా బ్రాహ్మణులే. అవన్నీ సమాజ శ్రేయస్కరంగా ఉండాలనే నియమం.  కానీ నేడు బ్రాహ్మణులమని చెప్పుకునే వారిలో 90%మందికి  ఆలక్షణాలు లేనే లేవు. ఇప్పుడు కాదు వేల సవత్సరాలుగా వాళ్ళంతా పతనమైపోయారు. 
 
అందరూ వైదికులే :-  వేేదమును విశ్వసించే వారందరూ వైైైైదికులే. జన్మతో   సంబంధం లేదు. పురాణాలు ఇతిహాసాలు  పరిశీలిస్తే ఈవిషయం సుస్పష్టం.  

స్మార్తులు ఎవరు? 

స్మృతులను అనుసరించి శాంతి పౌష్ఠిక కర్మలు అచరించుకునే అందరూ స్మార్తులే ! సామాన్య ప్రజలు అందరూ స్మార్తులే! కానీ మేము స్మార్తులము అని చెప్పుకునే వారు నిజానికి మోసపురితంగా ఆపదాన్ని స్వంతంచేసుకున్నారు. 

ఇది ఒకవిధంగా సామాజిక ద్రోహం. మేము బ్రాహ్మణులం , మేము వైదికులం, మేము స్మార్తులం అని ప్రకటించడం అంటే ... మేముతప్ప మిగతా వారు కాదు అన్నట్లు ఔతోంది. ఇది ఒకవిధంగా వంచన. 
మేము మనుషులం అంటే మిగతా వారు కాదా...? 
అలాగే మేము స్మార్తులం అంటే మిగతా వారు కాదా...? మేము వైదికులం అంటే మిగతా వారు కాదా? మిగతావారు వేదాన్ని చదవనవసరంలేదా? ఏవిధంగా మిగతా సమాజానికి వేదం చదవకూడదని నిషేధిస్తారు? 
నవిశేషోఽస్తివర్ణానాం సర్వం బ్రాహ్మ్యమిదం జగత్। 
బ్రహ్మణా పూర్వం సృష్టంహి కర్మభిః వర్ణతాం గతామ్।। (మ.భారతం. శాంతిపర్వం. 188వ అధ్యాయం. 10వ శ్లోకం) 

మనం అనుకుంటున్న ఈ వర్ణములకు విశేషమేమీ లేదు. ఈగత్తు బ్రహ్మచేతనే సృష్టించబడుటచేత అందరూ బ్రాహ్మణులే. కర్మలు చేత మిగతా వర్ణములు ఏర్పడినాయి. 
క్షతాత్ ఇతి క్షత్రియః ధర్మాన్ని అనుసరించి సమాజం చెడిపోకుండా తమ భుజబలంతో రక్షించువారు క్షత్రియులు. 

పైలం.. వైష్యం . పశుపోషణ, వ్యవసాయం, వాణిజ్యం పైలం అంటారు. అదికలవారు వైష్యులు. ఇది మహాభారతం లో భృగువు చెప్పాడు. 
ఇందులో వ్యవసాయం చేయువాడు శూద్రుడని, వాణిజ్యం చేయువాడు వైష్యుడని ఎప్పుడు విడదీసారో ఆధారాలు కనిపించడంలేదు. 

భృగువు అక్కడ చెప్పినదైతే 
హింసా అనృతప్రియా లుబ్దాః, సర్వకర్మోపజీవినః । 
కృష్ణాః శౌచపరిభ్రష్టాః తేద్విజాః శూద్రతాం గతాః ।। ( మ.భార. శాం.ప. 188వ అ. 13వ శ్లో.) 
హింసా ప్రవృత్తి, అబద్ధాలు చెప్పడంయందు నేర్పు, అన్నిపనులుచేసి జీవించడం, మలినమైన మనస్తత్వం, శుచిలేకపోవడం బాగా అచారమునుండి భ్రష్టమవ్వడము ఇలాంటివాటివలన బ్రాహ్మణులే శూద్రులు అయ్యారు. 
దీనిని బట్టి ఇప్పుడు బ్రాహ్మణులమనీ, వైదికులమనీ, స్మార్తులమనీ చెప్పుకునేవారిలో నూటికి తొంభై తొమ్మిది మందీ శూద్రులే తప్ప బ్రాహ్మణులుకాదు. 

ఇత్యేతే చతురో వర్ణా యేషాం బ్రాహ్మీ సరస్వతీ । 
విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్తు అజ్ఞానతాం గతః ।। 
ఈ నాలుగు వర్ణాలవారికీ సంబంధించినదిగా వేదసారస్వతమును బ్రహ్మ అందించాడు. కొంతమంది అజ్ఞానం చేత మిగతావారి లోభగణంచేత ఇది కొందరి వశమైంది. 

 బ్రహ్మ చైవ పరం సృష్టం యే నజానంతి తేఽద్విజాః 
ఈ సర్వమూ బ్రహ్మచేతనే సృష్టించబడినదిని తెలియక ఉన్నవారు ద్విజులు కాదు.
ఇట్లు పరిశీలిస్తే నూటికి తొంభై తొమ్మిది మందీ బ్రాహ్మణులుకాదు. 

మరి బ్రాహ్మణులమనీ వైదికులమనీ స్మార్తులమని చెప్పుకుని జనవంచనకు పాల్పడే వారంతా ఎవరు? 
అంటే మహా భారతంలో శాంతిపర్వం 188వ అధ్యాయం లో18వ శ్లోకం సమాధానం చెబుతోంది. 
పిశాచా రాక్షసాః ప్రేతా వివిధా మ్లేచ్ఛజాతయః । 
ప్రణష్టజ్ఞాన విజ్ఞానాః స్వచ్ఛందాచార చేష్టితాః ।। 
 తమ ఇష్టమువచ్చినవిధంగా శాస్త్ర వ్యతిరేకమైన కర్మలు ఆచారం కలవారు . శాస్త్ర వ్యతిరేకంగా కర్మలు ఆచరించు వారు మ్లేచ్ఛజాతయులు. పిశాచులు రాక్షసులు ప్రేతములే ఇలాంటి మ్లేచ్ఛజాతులుగా జన్మించాయి.   

అంటే ఈ స్మార్తులమని చెప్పుకునే వారెవరో 

పాఠకులు గ్రహించి ఉంటారు.
ఇలాంటి మ్లేచ్ఛజాతులుగా జన్మించిన పిశాచులూ రాక్షసులూ ప్రేతములే
 స్మార్తులమని చెప్పుకునే వారని అనిపిస్తే అది నాతప్పేంలేదు. 
మహాభారతం మరియు స్మృతులను అనురించి చెప్పాను.  









కామెంట్‌లు