దీపావళి 

ధనలక్ష్మీ పూజ , దీపదానం, ఉల్కాదానం చేయాలి 

తరువాత తీపిపదార్ధములు తినాలి.  

ప్రాతఃకాలం లో అభ్యంగనస్నానం సంధ్యావందనం. 

తరువాత కార్తీక స్నానం. దేవపూజ.

 తరువాత గోవులను ( అవులను ఎద్దులను) పూజించాలి. 

 సాయంకాలం సూర్యాస్తమయమున ధనలక్ష్మీ పూజ చేయాలి. 

షోడషోపచారములతో పద్మములో కూర్చుని ఉన్న లక్ష్మీ దేవిని ధ్యానం చేస్తూ పూజించాలి. ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రం తో సమస్త ఉపచారములు ... తరువాత 

నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే 

యా గతిః త్వత్ ప్రపన్నానాం సా మే భూయాత్ త్వదర్శనాత్ 

 అని నమస్కారం చేసి మధురపదార్ధములు నివేదించాలి. 

 ఆతరువాత బయట ప్రాకారములను గోశాలలను మందిరాలను దీపాలతో అలంకరించాలి.సాయంకాలం ప్రాకారములయందు, మఠములయందు, దేవాలయముల యందు  దీపములుంచవలెను

 నూనెతో లేదా నేతితో దీపాలు వెలిగించాలి ... కొవ్వొత్తులు మన సంప్రదాయంకాదు 

తరువాత నరక చతుర్దశి నాటివలే యమతర్పణం ఈక్రింది మంత్రముతో నువ్వులూ నీరు కలిపి దక్షిణవైపు తిరిగి క్రింది మంత్రాలతో కూడా తర్పణం ఇవ్వాలి... ఈయవలెను. 

ముఖ్య గమనిక : తండ్రి జీవించి ఉంటే వేల్లచివరలనుండి (దేవతర్పణంవలే) ఇవ్వాలి. తండ్రి గతించినవారు బొటకనవ్రేలు చూపుడు వ్రేలుకి మధ్యలోనుండి (పిత్రుతర్పణంవలె) తర్పణం ఇవ్వాలి. 

యమాయనమః #యమం #తర్పయామి 

ధర్మరాజాయ నమః #యమం #తర్పయామి  

మృత్యువే నమః #యమం #తర్పయామి

అంతకాయ నమః #యమం #తర్పయామి  

వైవస్వతాయ నమః #యమం #తర్పయామి 

కాలాయ నమః #యమం #తర్పయామి 

సర్వభూత క్షయాయ నమః #యమం #తర్పయామి 

 ఔదంబరాయ నమః #యమం #తర్పయామి 

 దధ్యా నమః #యమం #తర్పయామి 

 నీలాయ నమః #యమం #తర్పయామి 

పరమేష్ఠినే నమః #యమం #తర్పయామి  

వృకోదరాయ నమః #యమం #తర్పయామి 

చిత్రాయ నమః #యమం #తర్పయామి 

 చిత్రగుప్తాయ నమః #యమం #తర్పయామి .... 

 ఇలా తర్పణం ఇవ్వాలి.  బొద్దుగా జనపకర్రలు లేదాగోగుపుల్లలు కట్టగా కట్టి దివిటేలు దక్షిణ దిశగా నిలబడి చూపాలి. ఉల్కాదానం కూడా (ఆముదపు కాడలకు ప్రత్తి చుట్టి నూనె తో తడిపి వెలిగిస్తే ఉల్కలవలే పడును ఇదే ఉల్కాదానం) చేయాలి. 

 ఆతరువాత కాలుచేతులు కడక్కుని నీటితో కల్లు తుడుచుకుని, ఆచమనంచేసి... ఇంట్లో ప్రవేశించాలి. 

ఆతరువాత తీపి పదార్థాలు ధనలక్ష్మీ పూజ లో సమర్పించినవి తినాలి.  

దీపదానం వేరు అది ఎలా ...? ... ఇంకొక పోష్టు లో విన్నవిస్తాను ఇతరమతాలను నిందించుట వలన ప్రరయోజనం ఉందో లేదో కానీ... మన మతధర్మాలు ఆచరించడం ఉత్తమం అని అనుకుంటాను...! 

నచ్చిన వారు షేర్ చేయండి . షేర్ కుదరకుంటే కాపీ పేస్టు చేయండి... 

కామెంట్‌లు