దీపదానం - దీపావళి 

దీపదానం కన్నా మించినవ్రతంలేదు

వ్రతానాం సర్వదానానాం అన్ని వ్రతాలకన్నా గొప్ప వ్రతం ఏది  అని నారదుడు అడితే బ్రహ్మదేవుడు
దీపదానాత్ పరం నాస్తి త్రిషులోకేషు సర్వదా దీపదానం కన్నా అధికమైనది ఈలోకంలో లేదు .అని చెప్పాడు 

మాఘేవా కార్తికే మాసి, వైశాఖే శోభనేదినే మాఘ, కార్తీక,  వైశాఖమాసాలలో శుభదినాన ఈ దీపదానం ప్రారంభం చేసి ప్రతిరోజూ చేయమని బ్రహ్మాండ పురాణంలో  దీపదాన వ్రతంలో నారద మహర్షి కి  బ్రహ్మదేేేేవుడు చెెెెప్పాడు .

 ఎన్ని దీపాలు  ఎక్కడ వెలిగిస్తే ఏఫలితాలు...?


ఒకదీపం వెలిగించిన చాలు ఉపపాతకాలు నశిస్తాయి
పది దీపాలు వెలిగిస్తే మహాపాతకాలు నశిస్తాయి
వంద దీపాలు వెలిగిస్తే  విష్ణులోకం ప్రాప్తిస్తుంది.
అంతకన్నా ఎక్కువ వెలిగిస్తే... దానా ఫలం వివరించలేము.


ఏతత్ఫలం హరిక్షేత్రే , ద్విగుణం తులసీవనే
త్రిగుణం జాహ్నవీతీరే, కార్తీక్యాంతు చతుర్గుణం


ఈ ఫలము విష్ణు దేవాలయాలలో దీపం వెలిగించిన కలుగుతుంది.  తులసివనంలో ఐతే రెండు రెట్లు ఫలం, గంగా తీరంలో (గంగ అంటే సామాన్యమైన అర్ధం జలము. నదీతీరం లేదా చెరువు లేదా కాలువ ఒడ్డున). కార్తీకమాసం లో నాలుగు రెట్లు ఫలము లభిస్తుంది.  ఒడ్డున దీపాలు వెలిగించాలని ఉంది కానీ... నదీ జలములలో వదలాలని లేదు. అలా నదులలో వదలడమనేది నదీజలాలను కలుషితం చేయడమే. 

దీపం ఏనూనెతో వెలిగించాలి...

ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకం
అధమం మధుతైలంచ, వన్యాదిహ్యధమాధమం 

ఉత్తమం ఆవునేయి, నువ్వులు నూనె మధ్యమం, అన్యతైలములు అధమం, వనతైలములు అనగా ఇప్పనూనే మొదలైనవి మరింత అధమం. (భ్రష్టాచారాల స్మార్తులు ఇప్పనూనే శ్రేష్ఠమైనది అని ప్రచారం ఎలా చేసారో వారికే తెలియాలి)

ఆవునేయి దీపం వెలిగించిన జ్ఞానం, సంద కలిగి మోక్షము లభిస్తుంది
నూవులనూనె వలన భగవదనుగ్రహం సంపదలు కలుగుతాయి
ఆముదం దీపంపెడితే  సంపదలూ ఆయుష్షు కూడా నశిస్తాయి
గేదెనేతిని దీపం వెలిగించిన పూర్వజన్మ పుణ్యం కూడా నశిస్తుంది.

బ్రహ్మాండ పురాణంలో శతవర్తి వ్రతకల్పంలో దీపదానవ్రతమహిమ ఈవిధంగా వర్ణించారు  వర్ణించారు. 

ధర్మసింధు లో

ఏకతః సర్వదానాని దీపదానం తథైకతః
కార్తికే దీపదానస్య కలాం నార్హంతి షోడషీం

అన్ని దానములు కలసినా కార్తీకమాసం లో చేసిన దీపదానమును పదహారవ భాగానికికూడా సరిపోవు.

దీపదానం చేయు విధము

యజ్ఞార్హమైన కర్రను పాతి, దానిపై ఒక పలకను అమర్చి , దానిపై ఎనిమిది రేకుల పద్మమువలె ముగ్గు వేసి ...దాని మధ్యలో ఒకటి , ఎనిమిది రేకులలో ఎనిమిది దీపాలు వెలిగించి  విష్ణువును ఈ క్రింది విధంగా ప్రార్ధన చేసి సమర్పించాలి ...

దామోదరాయ నభసి, తులాయాందోలయా సహ
ప్రదీపంతే ప్రయచ్చామి, నమో ఽనంతాయ వేధసే

అనంతుడు సృష్టి కర్త యగు దామోదరుడైన విష్ణువును ఉద్దేశించి అంతరిక్షమున ఊయలలూగు దీపమును ఇచ్చితిని అని ప్రార్ధన చేసి సమర్పించాలి ... ఈ విధంగా నెలరోజులు దీపమును ఈయవలెను. 

ఇలా ఆశ్వయుజమాసం లో పూర్ణిమ నుండి లేదా దశమి నుండి  లేదా ఏకాదశి నుండి లేదా నరకచతుర్దశినుండి ప్రారంభించి నెలరోజులు చేయవలెను. లేదా కనీసం మూడు దినములు చేసి ఆతరువాత ఒకదీపమును వెలిగించవచ్చు. 

దీపదానం వలన ఫలము

బ్రహ్మాండపురాణంలో ఈవిధంగా వర్ణించారు 

ప్రతిపత్తి నాడు దీపదానం వలన వైధవ్యం రాకుండా ఉంటుంది
ద్వితీయ నాడు దీపదానం వలన సంతానం అభివృద్ధి
తృతీయ నాడు దీపదానం వలన సంపదలు కలుగుతాయి
చతుర్ధి నాడు దీపదానం వలన సౌభాగ్యం కలుగుతుంది
పంచమి నాడు దీపదానం వలన అధికారం  కలుగుతుంది
షష్ఠినాడు దీపదానం వలన రాజ్యము లభిస్తుంది
సప్తమి నాడు దీపదానం వలన ఇంద్రలోకం ప్రాప్తి
అష్టమి నాడు దీపదానం వలన ఇంద్రసాన్నిధ్యం
నవమి నాడు దీపదానం వలన ఇంద్రత్వం
దశమి నాడు దీపదానం వలన బ్రహ్మ సాన్నిధ్యం
ఏకాదశి నాడు దీపదానం వలన బ్రహ్మ లోకం
ద్వాదశినాడు దీపదానం వలన విష్ణు లోకం వెల్తాడు
త్రయోదశినాడు దీపదానం వలన విష్ణు సాయుజ్యము
చతుర్దశి నాడు దీపదానం వలన ముక్తి కలుగుతుంది
పౌర్ణమి అమావాస్యలనాడు దీపదానం వలన మోక్షము లభిస్తుంది.

ఈ విషయం చెప్పిన విననా ఈఫలము లభిస్తుంది.  అని బ్రహ్మాండపురాణం చెబుతోంది.







కామెంట్‌లు