బ్రాహ్మణులమని చెప్పుకునే వైఖానసులు  బ్రాహ్మణులేనా ?
ఈ పరిశోధనాత్మక  వ్యాసం వ్రాయడానికి ప్రధాన కారణం 
బ్రాహ్మణులమనిచెప్పకునేవారు, స్మార్తులమని చెప్పుకునే వారు, వైఖానసులుమని చెప్పకునేవారు... 
గత కొన్ని సంవత్సరాలుగా శ్రీవైష్ణవసంప్రదాయాన్ని అవమానించడం, సమతామూర్తి భగవద్రామానుజుల విషయమై అనుచితమైన విధంగా మాట్లాడడం చూసిన తరువాత సందేహం కలిగింది.  వీళ్ళు అందరూ బ్రాహ్మణులేనా లేక బ్రాహ్మణులమనిచెప్పకునేవారా?

పరిశోధన : ఎవరు ఈ వైఖానసులు అనే ప్రశ్నకు " వైఖానసో వానప్రస్తః  " అనే వాక్యం గౌతమస్మృతిలోనూ , మనుస్మృతి 6వ అధ్యాయం 21వశ్లోకం జవాబు గా కనిపిస్తుంది. 

శ్రీరామాయణంలో వైఖానసుల ప్రస్తావన కనిపిస్తోంది.  మహాభారతం లో కూడా కనిపిస్తోంది.  ఐతే అక్కడ వైఖానసులు వానప్రస్తులు.  

వానప్రస్తులు ఐన వైఖానసులకు కఠిననియమాలు ఉన్నాయి. 1.గ్రామాలలో నివాసం చేయరాదు. 2.పండిరాలిన పండ్లను మాత్రమే తినాలి. 3.దుంపలుకూడా (తీగ ఎండి తనంత తాను బయటపడినదానినే)ఎండిపోయన దుంపలే తినాలి.  4.బియ్యం తో చేసిన అన్నమ్మ తినరాదు. వనములో దొరకు ఋషులు భుజించు  నివారధాన్యముల అన్నముకూడా  తినరాదు.

ఇంత కఠినమైన నియమాలు కల వైఖానసుల పేరును కొందరు గుడిపూజారులు ఎలా వాడుకుంటున్నారు?  అనేది సందేహం కలిగింది. 

"ఏముంది...! కాలంతో పాటు మార్పు వచ్చింది.  మేము కాలమును అనుసరించి మారాము.  మేము విఖనసుడనే  ఋషినుండి పుట్టిన వారలము" అని వారి వాదం. 

అలా ఎలా మారుతారు? మారితే వైఖానసులు ఎలా ఔతారు?  కుక్కలు గోవులెలా ఔతాయి? 

వైఖానసులు అనబడేవారు వానప్రస్తులు కదా! వారికి సంతానం ఎలా కలుగుతుంది? 

వైఖానసులు అనబడే వానప్రస్తులకు (ఈమాట ఎందుకు వాడానంటే వానప్రస్తులు వైఖానసులుమాత్రమేకాక వాలఖిల్యులనేవారుకూడా ఉన్నారు) భార్యతో కలవరాదనే నియమం కూడా ఉంది. అలాంటి పరిస్థితి లో వైఖానసులనబడే వానప్రస్తులకు గుడిపూజారులు ఐన వైఖానసులు ఎలా పుట్టారు...?

ఐనా వాళ్ళు ఎవరైతే మనకు దేనికి? అని  అంటారా.......
1. ప్రధానమైన దేవాలయాలలో చేరి అక్కడ సంప్రదాయాలు పాడుచేస్తుంటే ....
2. తిరుమలలో వెయ్యికాళ్ళమండపం కూలగొట్టంచడం చూసాక ..
3. ప్రసిద్ధమైన ఆలయాల్లో సైతం పూర్వంనుండి ఉన్న ఆళ్వార్ ల సన్నిధులు తొలగిచినప్పుడు...
4. తాడితపీడిత జనులందరూ భగవంతుని సేవించుకోవడానికి అర్హులే అని జగత్తులో జనులందరి హితంకోసం తిరుమంత్రం ఇచ్చిన జగద్గురువును దర్భాషలాడినప్పుడు.
5. వేయివేదమంత్రములకన్నా వేనవేలు రెట్లు వైఖానసులు గొప్పవారు వైఖానసులు 
అని మహాభారతం చెప్పినదని అబద్ధాలు ప్రచారంచేసి ప్రపంచంలో ఆస్తికులందరూ పరమపవిత్రమని ఆరాధించే వేదమును అవమానిస్తే ..

ఈ వైఖానసులు ఎవరు అని సందేహం కలిగి పరిశోధించి వారి 
జన్మ ఎంతనీచమైనదో అందరికీ తెలియజేయాలని ప్రయత్నం చేయడం తప్పు కాదు.

సశేషం..... (ఇంకా ఉంది)
 

  

 









 


కామెంట్‌లు