పెరియాళ్వార్ అనబడే శ్రీవిష్ణుచిత్తుల వైభవం

వీరిని మూడుపేర్లతో వ్యవహరిస్తారు. పెరియాళ్వార్, శ్రీవిష్ణుచిత్తులు, పట్టరపిరాన్, భట్టనాథులు.

ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవారు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెళ్ళి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాళ్ళను ఆళ్వారులు అని అంటాం. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి తెలిసేలా పాశురములరూపంగా (పాటలరూపంగా) తెలియజేసిన మహనీయులు ఆళ్వారులందరూ. అవే నాలాయిర దివ్యప్రబందాలు. అనగా నాలుగువేల పాశురములతో కూడిన దివ్యప్రబందాలు.

భగవంతుని దివ్య ఆశీస్సులతో వేదం, వేదార్థం, ఇతిహాసం, పురాణముల సారాన్ని గ్రహించారు పెరియాళ్వార్. ఎలాగైతే శ్రీవాళ్మీకి బ్రహ్మ అనుగ్రహంవల్ల , శ్రీ ప్రహల్లాదుడు భగవానుని శ్రీపాంచజన్య స్పర్శ వల్ల ఙ్ఞానాన్ని పొందినారో అలా వీరుకూడ పొందినారు. భగవానుని నిర్హేతుక కృప వల్ల పెరియాళ్వార్ వేదసారమగు  శ్రీమన్నారాయణుడే  పరతత్వమని గ్రహించారు.

ఈ ఆళ్వారులందరిలో  - భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం గలవారు విష్ణుచిత్తులవారు.  అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించింది విష్ణుచిత్తులవారిని.  అంతేకాదు .... వేదంచదువుటకు ముందు "హరిఃఓం" అని పలికినట్లు ... దివ్యప్రబందాలు చదువుటకుముందు  పెరియాళ్వార్ అనుగ్రహించిన "తిరుప్పల్లాండు" అనుసందిస్తాం ( "తిరుప్పల్లాండు" పారాయణ చేస్తాము )

పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం భగవంతు ఆనందమునకై  (నిత్య కైంకర్యము చేయాలని) మాత్రమే తమ కైంకర్యమును చేసిరి. పెరియాళ్వార్.... శ్రీమన్నారాయణుడు  రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. 

శ్రీవైష్ణవగురువులు  పిళ్ళై లోకాచార్యులు మరియు మణవాళమాముణులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు  విధిగా కీర్తించబడాలని  తెలిపారు. పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం భగవంతు ఆనందమునకై  (నిత్య కైంకర్యము చేయాలని) మాత్రమే తమ కైంకర్యమును చేసిరి. పెరియాళ్వార్, శ్రీమన్నారాయణుడు  రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. శ్రీవైష్ణవగురువులు  పిళ్ళై లోకాచార్యులు మరియు మణవాళమాముణులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు  విధిగా కీర్తించబడాలని  తెలిపారు.

మిగితా ప్రబంధములన్నీ క్లిష్ఠమైన వేదాంత సంబంధ విషయములతో కూడుకొన్నవి, కాని  తిరుపల్లాండు సులువుగా ఉండి నేరుగా భకగవంతునికి మంగళాశాసనము చేస్తుంది. మిగితా ప్రబంధములన్నీ ఆకారమున పెద్దవిగా ఉన్నవి, కాని తిరుపల్లాండు చిన్నది మరియు సారవంతమైనది – కేవలం 12 పాశురములలో సారవంతమైన  విషయాలు వర్ణించబడి ఉన్నాయి.

పిళ్ళైలోకాచార్యులు తమ దివ్య శాస్త్రమైన శ్రీవచన భూషణములో, తిరుపల్లాండును (మంగళాశాసనమును) కీర్తిస్తు ఇది  భగవంతున్ని  పొందించే  ఉపాయమైన దినచర్యలో భాగమని తెలిపారు.

మణవాళమామునులు తమ ఉపదేశ రత్నమాలలో పెరియాళ్వార్ వైభవాన్ని వరుసగా ఐదు పాశురములలో వర్ణించారు. అందు

  • 18వ పాశురమున  – సర్వేశ్వరుని యందున్న అతి అభినివేశముచే మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వార్ల కన్నా వీరికి ఉన్న గొప్ప భేధముచే వీరికి పెరియాళ్వార్ అనే తిరునామం కలిగినదని తెలిపారు.
  • 19వ పాశురమున  – ఎలాగైతే సంస్కృత వేదమునకు ఓం (ప్రణవం) కారము సారమో మరియు ఆదిగా ఉండునో అలాగే ద్రావిడ దివ్య ప్రబంధమునకు తిరుపల్లాండు  సారము మరియు ఆదిగా కలదిగా ఏర్పడినది.

వీరికి మరో విలక్షణ విశేషమేమనగా తమ కూతురైన గోదాదేవిని శ్రీరంగనాథునికిచ్చి వివాహం చేసి శ్రీమన్నారాయణునికి మామగారైనారు.

ఇక వీరి చరితమును తెలుసుకుందాము

వేదపండితులు నివసించు శ్రీవిల్లిపుత్తూర్ అనే దివ్యదేశమున పెరియాళ్వార్ అవతరించిరి. 

ప్రహల్లాదుడు ఎలాగైతే జన్మతః భగవద్భక్తితోనే జన్మించారో అలాగే వీరు కూడ భగవంతుని యొక్క నిర్హేతుక కృపచే  భగవద్భక్తితోనే జన్మించారు.  పెరియాళ్వార్ భగవంతునికి  ఏదైన కైంకర్యములో నిమగ్నమవ్వాలని తలిచారు. అదే తడవుగా అన్నీ పురాణాలను పరీశిలించారు. భూదేవి యొక్క భారమును తగ్గించుటకు కణ్ణన్ (ఎంపెరుమాన్) మథురలో కనబడ్డాడు. దేవకికి జన్మించి యశోద దగ్గర పెరిగినాడు. సదా నిత్యసూరులచే దివ్య పూమాలలచే అలంకరింపడిన ముగ్దమనోహర శ్రీకృష్ణుడు కంసుని వద్ద పనిచేయు మాలాకారుని వద్దకు వెళ్ళి పూమాలలను అడిగాడు. స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి మాలలను అభ్యర్థించడం వల్ల ఆనంద భరితుడైన ఆ మాలకారుడు శ్రీకృష్ణుడు ఆనందించేలా అందమైన పరిమళ భరిత మాలలను ఇచ్చాడు.  

దీనిని ఆదర్శంగా చేసుకొనిన పెరియాళ్వార్ ప్రేమతో కట్టిన మాలలను సమర్పించుట ఉత్తమ కైంకర్యముగా భావించి ఆ రోజు నుండి శ్రీవిల్లిపుత్తూర్లోని దేవాలయంలో వటపత్రశాయి కి పూమాలలను సమర్పించ సాగారు.

ఆ కాలంలో పాండ్య వంశరాజైన వల్లభ దేవుడు పాండ్యనాడును మథురైను రాజధానిగా చేస్కొని ధర్మానుసారంగా పరిపాలించసాగాడు. ఓ నాటి రాత్రి తన రాజ్య సుపరిపాలనా కార్యాచరణకై తన రాజ్యమున మారు వేషములో తిరగసాగాడు, ఆ సమయాన ఒక బ్రాహ్మణుడు వేరొకరి గృహం వెలుపల అరుగుపై కూర్చుండడం చూశాడు. అతనిని  పరిచయం చేస్కొని "తమరు ఎవరు?" అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నేను తీర్థయాత్రచేయు బ్రాహ్మణుడినని చెప్పాడు. ఆ రాజు వాడిని బ్రాహ్మణుడిగా నిర్ణయంచేసుకొనుటకు ఓ శ్లోకాన్ని పఠించమన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఈ శ్లోకాన్ని పఠించాడు. 

వర్షర్థమస్తౌ ప్రయతేత మాసాన్ని చర్థతమర్థతం దివ్యసంయతేత |
వార్థక్య హేతోః వయసా నవేన పరార్థ హోతేరిహ జన్మనా చ||

 శ్రమ చేయాలి. వృద్ధ్యాపములో విశ్రాంతి కోసం యవ్వనంలో శ్రమించాలి. శరీర అవసాన అనంతర ఉజ్జీవనమునకై శరీరము ఉండగానే శ్రమించాలి.

ఆ మాటలు విన్న ఆ రాజు ఈ భౌతిక సంపదలు మరియు సుఖములతో హాయిగా ఉన్నాను కదా మరి శరీర అవసాన అనంతరం దేనిని పొందాలి? దానిని ఎలా చేరాలి? అని ఆలోచనచేసి  తమ  పురోహితుడైన శెళ్వనంబి దగ్గరకు వెళ్ళి... 

పరతత్త్వ దైవము ఎవరు?  శరీర అవసానంతరం అతన్ని చేరుట ఎలా ? 

అని ప్రశ్నించాడు. శ్రీమన్నారాయణుని పరమ భక్తుడైన శెల్వనంబి, వేదాంతాన్ని అనుసరించి పరతత్త్వ నిరూపణకై విద్వాంసులందరిని సమావేశపరచాలని రాజుతో విన్నవించాడు. ఆ రాజు  విద్వాంసులందరిని ఆపస్తంబున్ని ప్రమాణ సూత్రమైన.”ధర్మఙ్ఞ యసమయః ప్రమాణం వేదాశ్చ” అను దాని మీద నిజమైన పరతత్త్వ నిరూపణకై ఆహ్వానించాడు.

పరతత్వ నిరూపనకు వేద కార్యం తెలిసిన వేదఙ్ఞులు ప్రథమ ఆధారం మరియు వేదం ద్వితీయాధారం. ఆ రాజు చాలా ధనమును వస్త్రపు మూటలో పెట్టి ఎవరైతే వేద ప్రతిపాద్యున్ని నిరూపణగా తెలుపుతారో వారికి అందడానికి  ఆధారంపై వ్రేలాడ దీశాడు. వివిధ ప్రదేశముల నుంచి వివిధ విద్వాంసులను వాదనకై సమావేశ పరిచాడు.

వటపత్రశాయి పెరుమాళ్ (శ్రీవిల్లిపుత్తూర్), పెరియాళ్వార్  స్వప్నమున సాక్షాత్కరించి వల్లభ దేవుని సభకెళ్ళి శుల్కమును పొందుమని ఆఙ్ఞాపించారు. 

పెరియాళ్వార్  వినయంగా ఇలా సమాధాన మిచ్చారు ‘ఆ శుల్కం వేదాంతం ద్వారా సిద్ధాంత స్థాపన చేసిన వారికి కదా, కాని నేను వేదమును కానీ వేదాతమునుకానీ తెలియని వాడిని పరతత్వనిర్ణయం   ఎలా  స్థాపించగలను?’ అన్నారు . భగవానుడు, ఆళ్వార్ కు ఇలా సమాధానమిచ్చారు ‘ వేద ప్రతిపాదనలో దానర్థ ప్రతిపాదనలోను నేను మీకు సహాయపడగలను నీవు వెళ్ళు’. అన్నారు.  

 స్వప్నము నుండి తేరుకొని తన నిత్యానుష్ఠానములను ముగించుకొని ఆ వల్లభరాజు ఉన్న మథురైకి బయలుదేరారు పెరియాళ్వార్. బ్రాహ్మణోత్తముడైన ఆ పెరియాళ్వార్ మథురకు చేరుకోగానే శెల్వనంబి మరియు ఆ రాజు ఆళ్వార్ లకు వినమ్రతతో ఆహ్వానపరిచారు. స్థానిక పండితులు  రాజుకు "ఈ భట్టనాథుడు వేదములో చదవలేదు, పంక్నితిదూరుడు. అర్హుడుకాదు " అని అభ్యంతరం చెప్పారు.

 వటపత్రశాయికి అంకితభావముతో కైంకర్యము చేయు ఆ పెరియాళ్వార్ని గౌరవమర్యాదలతో  సత్కరించి, వేదాంతమాధారంగా తత్వ ప్రతిపాదనను చేయమన్నారు. 

తర్క విధానంలో దీని ప్రమాణాలు.

సమస్త శబ్దమూల త్వాద్ అకారస్య స్వభావతః 
సమస్త వాచ్య మూలత్వాత్ బ్రహ్మణోపి స్వభావతః
వాచ్య వాచక సంబంధస్తయోః  అర్థాత్ ప్రదీయతే.

అన్నీ శబ్దములు సహజంగా ‘అ’ అక్షరం నుండి జనించును. ఆ శబ్దం సమస్త అర్థములు సహజముగా బ్రహ్మం నుండి జనించును. కావున అక్షరం మరియు బ్రహ్మం మధ్య సంబంధము కూడా సహజ సిద్ధమని తెలియును.

భగవద్గీతలో భగవంతుడు తనను తాను ఇలా నిర్ణయించుకున్నాడు ”అక్షరాణామకారోస్మి” – నేను అన్నీ అక్షరములలో అకార వాచ్యుడను.

అకారో విష్ణువాచకః” అను ప్రమాణమును అనుసరించి అకారం పరతత్వమగు శ్రీమన్నారయణుని  తెలుపు విష్ణు వాచక శబ్దం.

తైత్తరీయోపనిషద్ శ్రీమన్నారాయణుని విశేష గుణములను ఇలా తెలిపినది

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తత్ విఙ్ఞానస్య తత్ బ్రహ్మేతి.  

సమస్త విశ్వం మరియు ప్రాణులు దేనినుండి ఉద్భవిస్తాయో, ఏ విశ్వం దేని ఆధారంగా కొనసాగుతుందో, లయ మందు దేనిలో విలీనమవుతుందో, ప్రాణులు చేరవలసిన మోక్షమును చేరునో అదే బ్రహ్మముగా తెలుపబడుతుంది. కావున జగత్తు కారణత్వం (విశ్వం సృజనకాధారం)  ముముక్షు ఉపాస్యత్వ (మోక్షమును పొందుటకు ఆరాధించవలసిన వస్తువు) మరియు మోక్షప్రదత్వ (జీవాత్మకు మోక్షమును అనుగ్రహించు సామర్థ్యం గల) ములు పరతత్వమునకు ఉన్న ముఖ్యమైన గుణములని తెలుపబడింది.

ఆ గుణములన్నీ శ్రీమన్నారాయణుని యందు చూడవచ్చని ప్రమాణం

విష్ణోః సకాచాత్ ఉద్భుతం జగత్ తత్రైవ చ స్థితం|
స్థితి సమ్యకర్తాసౌ జగతోస్య జగత్ చ సః ||

 విష్ణు పురాణమున తెలిపినటుల, ఈ విశ్వం విష్ణువు నుండి సృజించబడును, ప్రళయమున (సృష్ఠి లేనప్పుడు) విష్ణువు నందు చేరును; ఇతనే నిర్వహించును మరియు అంత మొందించును; విశ్వమునంతయు తన శరీరముగా కలవాడే విష్ణువు .

నారాయణాత్ పరో దేవో న భూతో నభవిష్యతి|
ఏతత్ రహస్యం వేదానామ్  పురాణానామ్ చ సమ్మతమ్||

వరాహపురాణములో చెప్పినటుల నారాయణునికి సమమైన లేదా అధికమైన  దైవం భూతకాలమున లేదు భవిష్యత్ కాలమున ఉండబోదు. ఇది అతి గుహ్యమైన రహస్యంగా వేదంలో చెప్పబడింది అలాగే పురాణాల్లో కూడ.

సత్యం సత్యం పునస్సత్యం ఉద్ధృత్వ బుధముచ్యతే |
వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం ||

నారద పురాణములో వ్యాస భగవానుడు వివరించినటుల, “నేను ముమ్మారులు చేతులెత్తి నిర్ణయిస్తున్నాను (ఉద్ఘోషిస్తున్నాను) కేశవుని కన్న పరమైన (అధికమైన) దైవం లేదు వేదం కన్న పరమైన శాస్త్రం లేదు”.

ఇలా పెరియాళ్వార్ శ్రీమన్నారాయణుని పరత్వముపైన చెప్పిన ప్రమాణాలను మరియు శ్రుతుల నుండి ఇతిహాసముల నుండి, పురాణముల నుండి ఉట్టంకిస్తు నిర్ణయించారు. పిదప ఆ సంపద ఉన్న మూట (గెలిచిన వారి బహుమతి) దైవ సంకల్పముగా పై నుండి కింద పడగా పెరియాళ్వార్ దానిని గ్రహించారు.

ఇదంతా గమనించిన ఆ పండితులు, ఎవరైతే ఆళ్వార్ను తిరస్కరించారో వారు మరియు ఆ మహారాజు చాలా ఆనందముతో వారి నమస్సులను అందించారు పెరియాళ్వార్లకు. వారందరు పెరియాళ్వార్, వేదాంత సారాన్ని విస్పష్ఠంగా విశేష ప్రభావముగా వెల్లడించారని ఆనందించారు. వారికి ఉత్సవ గజంపై  గొప్ప ఊరేగింపును ఏర్పాటు చేశారు. మిగితా పండితులందరు ఛత్ర చామరలు చేతిలో ధరించిరి. వారు ఇలా ప్రకటించసాగిరి “అత్యంత ప్రమాణముగా వేద సారమును తెలిపి కీర్తిని పొందినవారు వేంచేస్తున్నారు” అని.  వల్లభ దేవుడు ఙ్ఞాన విశేషములను అనుగ్రహించిన పెరియాళ్వార్లను భట్టర్ (గొప్ప పండితులు) లకు విశేష ఉపకారకులు అనే అర్థం వచ్చే “పట్టర్ పిరాన్” అను బిరుదనామంతో సత్కరించారు. అంతటా విశేష ఉత్సముగా జరుగు ఆ  ఊరేగింపులో ఆ రాజు కూడ పాల్గొన్నారు.

కామెంట్‌లు