శ్రీమతే రామానుజాయ నమః 

  • విశ్వానికి శాంతి సౌభాగ్యాలు అందించే భారతీయ వైదిక సంప్రదాయము నేడు మనము అనుభవిస్తున్నామంటే అది భగవద్రామనుజులు మనకు అనుగ్రహించిన వరమ్ .
  •  
  • భగవాదారాధనకు కులము అవసరము లేదని లేదని, భగవంతునిపై ప్రేమకలవరెవరైనా అర్హులే యని  చాటి భక్తివిప్లవానికి నాందిపలికిన ప్రధమాచార్యులు భగవద్రామానుజులే.

  • నిమ్నవర్గమువారైనను ఆళ్వారులకు దేవాలయాలలో ఆరాధన జరగాలని,  ఆళ్వారుల దివ్యప్రబంధాలను వేదమువలే పారాయణ చేయాలని నిర్ణయించినవారు భగవద్రామానుజులే  .

  • అంతేకాదు వైష్ణవం స్వీకరించిన అందరూ వైష్ణవులే. వైష్ణవులను కులంతో చూడకూడదని నియమమును ఏర్పరిచినవారు భగద్రామానజులే.

  • దానికి కృతజ్ఞతగా వారి తిరునక్షత్రము (జయంతి) నాడు వారనుగ్రహించిన మార్గములో పయనిస్తామని భగవదారాధన పూర్వకముగా విన్నవించి, చివర మంగళాశాసనం లో ప్రక్క చిత్రములోని శ్లోకాలు కూడా విన్నవిస్తాం .భగవద్రామనుజుల చరిత్ర సంగ్రహముగా ప్రక్క చిత్రములో ఇవ్వబదినది. భగవద్రామనుజులు ద్రావిడ పంచాంగమును అనుసరించి చిత్రి మాసములో అవతరించారు . తెలుగు  పంచాంగము ను  అనుసరించి వైశాఖమాసం . 

కామెంట్‌లు