శ్రీమతే నారాయణాయ నమ:
శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః
నాకు సంబందించిన వివరాలు
అంతగా ప్రాముఖ్యత కలవి కావు . కానీ తెలియచేయడం అవసరమని కొందరి కోరికను అనుసరించి తెలియచేస్తున్నాను.
- తల్లి తండ్రులు పెట్టిన పేరు = జనార్దన రావు
- ఆచార్యులు పెట్టిన పేరు = రామానుజ దాసు (జనార్దన రామానుజ దాసు)
- శ్రీకరమైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించిన వాడిని కనుక శ్రీమంతుడిని (శ్రీమాన్ జనార్దన రామానుజదాసు అని మీచే పిలువబడుచున్నాను)
- ప్రాధమికవిద్య= జన్మస్థలం డోలమడ గ్రామంలో , పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా.
- 6,7 తరగతులు = ప్రక్కనేగల ఎమ్. సింగుపురంలో ప్రాధమికోన్నత పా పాఠశాలలో (ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో) పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా.
- 8,9,10 తరగతులు=జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో , జి . సిగడాం , శ్రీకాకుళం జిల్లా. (నిద్దాం గ్రామ సర్పంచి - శ్రీమాన్ మీసాల రామకృష్ణం నాయుడు గారి దాతృత్వము తో చదువుకున్నాను )
- విద్యాప్రవీణ (సంస్కృతం ) గుంటూరు జిల్లా జిల్లెల్లమూడిలో మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలో మాతృ శ్రీ అనసూయ మాత పాలనలో 1978 నుండి 85 వరకు జిల్లెల్లమూడిలో ఉన్నాను .
- కాకతీయ సిమ్మెంట్ వారి సౌజన్యంతో జగ్గయ్యపేటలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయరు స్వామివారిచే నిర్వహించబడిన భారతీయ తత్వకళాశాలలో కొంతకాలం ఉండుటచేత శ్రీస్వామివారియొక్క మరియు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామివార్ల అనుగ్రహముచే ఉభయ వేదాంతములను శాస్త్రములను అధ్యయనము చేయడము తెలిసినది .
- శ్రీశ్రీశ్రీ చిన్నజీయరు స్వామివారియొక్క మరియు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామివార్ల ఆదేశానుసారం - సర్వధర్మ సారమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రచారములో భాగముగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయములో తరగతులు నిర్వహించడము జరిగినది.
- తరువాత మిత్రుల సహాయ సహకారములతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రచారమునకు గుంటూరు ఖమ్మమ్ తూర్పుగోదావరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో అనేకచోట్ల తరగతులు నిర్వహించడము జరిగినది.
- కాకినాడకు అనుకునియున్న వలసపాకల గ్రామములో శ్రీ శ్రీ శ్రీ చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో మిత్రుల ఆర్దిక సహకారముతో శ్రీరామ మందిరం నిర్మించడము జరిగినది. సనాతన ఆర్షసంప్రదాయ ప్రచారకేంద్రములుగా దేవాలయాలు ఉండాలనే శ్రీ జీయరుస్వామివారి ఆశయాలకు అనుగుణముగా ఈ ఆలయము నడుపుటకు ప్రయత్నము జరుగుతోంది.
- ధర్మప్రచారము అనునది కత్తులపైన నడక. లోకములో భక్తి అను మాటకు అర్థము మారిపోయినది. ఆసక్తి తగ్గింది ఆర్భాటం పెరిగిన్ది. కనుకనే జీవనమునకు ప్రైవేటు కాలేజీలో ఉద్యోగము చేసుకుంటూ పయిన పేర్కొన్న కార్యక్రమాలను చేయడము జరుగుతోంది .
- స్తోత్రములు mp 3 రికార్డు చేసి musichouse27 అను పేరుతో ఉన్నyoutube లో పెట్టడము జరిగినది . youtube లో musichouse27 అని టైప్ చేస్తే లభిస్తుంది . లేదా sree matha enterprises వారిని 94406 93136 సెల్ లో సప్రదించండి . లేదా 9440896256 సెల్లో సంప్రదించండి
ఇంకా ఉన్నది .........
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి