కార్తీకమాసములో ప్రధానమైనవి 
కార్తీకసమారాధన
ధాత్రీమూలమందు దామోదరపూజ  
విష్ణు ప్రబోధోత్సవం, తులసీదామోదరుల కళ్యాణం. 

కార్తీకమాసం శుద్ధ నవమి మొదలు పౌర్ణమి వరకూ ఎప్పుడు ఐనా కాలనియమములేదు. 

సంకల్పం: సర్వ పాపక్షయద్వారా శ్రీదామోదరస్వామినః కైంకర్యతా సిధ్యర్ధం యధాశక్త్యా ధాత్రీమూలే దామోదరపూజాం కరిష్యే. ధాత్రీవృక్షరూప శ్రీ లక్ష్మీ నారాయణ స్వామినే నమః . ధ్యాన ఆవాహనాది షోడషోపచార పూజాం కరిష్యే....

షోడశోపచారములు దామోదరాయనమః అనే మంత్రంతో సమర్పించాలి .

షోడశోపచారములు తరువాత దామోదరునకు చందనం పుష్పములు ఫలములతో ఈక్రింది మంత్రంతో అర్ఘ్యం సమర్పించాలి. 

అర్ఘ్యం గృహాణ భగవన్ సర్వకామప్రదో భవ. 
అక్షయా సంతతిర్మేఽస్తు దామోదర నమోఽస్తుతే

 దామోదరా ఈ అర్ఘ్యం స్వీకరించి నా సర్వకోరికలను తీర్చుము, అక్షయమైన సంతానమును అనుగ్రహించు. దామోదర నీకు నమస్కారము.

ధాత్రీమూలమందు అనగా ఉసిరి చెట్టు మొదట పూజ
గంధము, పుష్పములతో నామార్చన ....ప్రతీ నామమునకు ఓం అని చేర్చుకోవాలి...

 ధాత్ర్యైనమః ,శాంత్యై నమః,  మేధాయై నమః,  కాంత్యై నమః,  ప్రకృత్యై నమః,  విష్ణు పత్న్యై నమః,  మహాలక్ష్మ్యై నమః,  రమాయై నమః,  కమలాయై నమః,  ఇందిరాయై నమః,  లోకమాత్రే నమః,  కళ్యాణ్యై నమః, కమనీయాయై నమః, సావిత్ర్యై నమః, జగధ్దాత్ర్యై నమః,  గాయత్ర్యై నమః , సుధృత్యై నమః,  అవ్యక్తాయై నమః,  విశ్వరూయై నమః,  సురూపాయై నమః,  అబ్ధిభవాయై నమః...

ఆరాధనానంతరం.... తర్పణం....సవ్యముగానే తర్పణం  ఇవ్వాలి ..... 

శ్లో ।।  పితా పితామహశ్చ అన్యే అపుత్రా యేచ గోత్రిణః ...
          తే పిబంతు మయా దత్తం ధాత్రీ మూలే అక్షయం పయః
          ఆబ్రహ్మ స్తంబపర్యంతం అపుత్రా యేచ గోత్రిణః ...
          తే పిబంతు మయా దత్తం ధాత్రీ మూలే అక్షయం పయః

తర్పణం తరువాత తోరణ బంధనం 


పదకొండు  లేక మూడు దారాలతో తోరణంచేసి ... అదారం ఉసిరిక  చెట్టునకు కట్టాలి ఈ క్రింది మంత్రం చదువుతూ.... 

          దామోదర నివాసాయై దేవ్యై ధాత్ర్యై నమోఽస్తుతే 
          సూత్రేణానేన బధ్నామి సర్వదేవ నివాసినీమ్ .

తదుపరి నైవేద్యం నాలుగు దిక్కులు యందు...

 "ధాత్ర్యై నమః"    అను మంత్రముతో 
ఎనిమిది దిక్కులు యందు దీపములుంచవలెను. 

ఎనిమిది  సార్లు ప్రదక్షిణం చేస్తూ ఇలా ప్రార్థన చేయాలి ...

శ్లో।।  ధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరీ 
         పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే 
        ప్రజ్ఞాం మేధధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం,
        నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ...


సర్వ పాపములను పోగొట్టే ఓ ధాత్రిదేవీ...! నీకు నమస్కారము...! పుత్రులను, కీర్తినీ, బలమును, ప్రజ్ఞను, బుద్ధిని,  సౌభాగ్యాన్ని, శాశ్వతమైన విష్ణుభక్తినీ, ఆరోగ్యమునూ ఇవ్వుము. నన్ను నిత్యం పాపములనుండి రక్షించు. 
అని నమస్కారం చేసి నేయికల కంచుపాత్ర లేదా మట్టి పాత్ర ధాత్రీవృక్షమునకు సమర్పించాలి. 

యధాశక్తిగా దానం తరువాత  తులసీకళ్యాణం ఇంకొక పోష్టులో ...

శాస్త్ర విధిని అనుసరించి చేసే కార్యములు మాత్రమే ఫలితాలను ఇస్తాయి. శాస్త్ర విధిని అతిక్రమించి చేసినవి ఫలితములను ఈయవు. ఒకవేళ శాస్త్రం తెలియకపోతే భగవంతుని ప్రపత్తి చేసి యధాశక్తి చేయవచ్చు అనేది భగవద్గీతలో భగవానుడే ఉపదేశించాడు. 

కామెంట్‌లు