భద్రాచలం లో గోత్రప్రవరలవిషయం





శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకం pdf ఎవరో పంపించారు... 
ఇది పూర్తిగా చదివాను...
 చిదంబరశాస్త్రిగారు వెలిబుచ్చిన అంశాలు 
పూర్తిగా అసంబద్ధమైనవి

 1వ అంశం గోత్రప్రవరలే మార్చేశారు : ఈ పుస్తకంలో మొదటి లోనే గోత్రప్రవరలే మార్చేశారు అన్నారు.... 


జవాబు:  గోత్రప్రవరలు మారలేదు మొదటిి నుండీ  అచ్యుత గోత్రముతోనే  కళ్యాణము జరుగుతున్నదని...   ఆధారాలు కనిపిస్తున్నాయి... 

  • 1. జమ్మలమడక మాధవరామశర్మగారు ... తెనాలి సాధన గ్రంధమండలివారు వేసిన శ్రీవిష్ణుసహస్రనామ శంకరభాష్యానువాదమునకు ముందు మాటలో ఇక్కడ ఉన్నది రామనారాయణుడే ... అనీ ... అచ్యుత గోత్రముతో కళ్యాణము జరుగుతున్నదనీ వ్రాసారు. ఈ పుస్తకం 1980 దశకంలో వేసారనుకుంటా... అప్పటికి ఆ స్వామివారు సన్యాసాశ్రమ స్వీకారమే చేలేదు. అన్నదానం చిదంబరశాస్త్రిగారు పేర్కొన్న  వేదపండితులు శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యస్వామివారుగానీ  స్థానాచార్యులవారు శ్రీమాన్ స్థలశాయి స్వామివారుగానీ అప్పటికింకా విద్యార్ధులగా వేదాధ్యయనమునందే ఉన్నారు. అలాంటి వారు మార్చేశారనడం కేవలం దుర్బుద్ధితో చేసిన దుష్ప్రచారం. 

  • 2.  శ్రీభద్రాచల పునర్నిర్మాణ సంఘంవారు  1956 ప్రాంతంలో వేసిన పుస్తకంలో  కూడా రామనారాయణ అని పిలువబడుతున్నట్లు ... కళ్యాణము అచ్యుత గోత్రముతో జరుగుతున్నట్లు వ్రాసారు. అప్పటికి ఈ వేదపండితులు గానీ స్థానాచార్యులవారు గానీ పుట్టలే ... ఆ ప్రముఖ  స్వామివారు కూడా చిన్నపిల్లవాడై ఉంటారు. 

  • 3. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు కళ్యాణము నకు వ్యాఖ్యానం చెప్పిన వీడియో వైరల్ ఐంది . అందులోకూడా రామనారాయణుడనీ ... గోత్రప్రవరలు అచ్యుత పరబ్రహ్మ గోత్రముతో కళ్యాణము జరుగుతున్నట్లు చెప్పారు. 

ఎప్పుడైనా అచ్యుతగోత్రము కాకుండా వేరే గోత్రప్రవరలు చెప్పినట్లు ఆధారాలు చూపగలరా...?

అలాంటిది ఈనాడు క్రొత్తగా  మార్చేశారు అని బ్రహ్మ శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రిగారు ఎలా వ్రాసారు అనేది సందేహం?

స్మార్తపద్ధతిలో వసిష్ఠగోత్రముతో చెప్పమని పట్టుబడుతున్నారు స్మార్తులు కొందరు. ఇది వారిసంప్రదాయానికి చెందినదేవాలయము కాదు. వైష్ణవసంప్రదాయానికి చెందిన దేవాలయం. దీనిని క్రమంగా తమహస్తగతం చేసుకోవాలనే కుట్రతో ఈవిధమైన దుష్ప్రచారం సాగిస్తున్నారు.

సీతారాముల కళ్యాణం లో
స్మార్తులు ఇంతవరకూ చెబుతున్న గోత్రప్రవరలు అసంబద్ధమే కాదు తప్పులుకూడా.

వసిష్ఠ మైత్రావరుణ  కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత రఘుమహారాజ వర్మణో నప్త్రే అని చెబుతున్నారు.   అంటే రఘుమహారాజుకి మునిమనుమడు అని. అంటే రఘుమహారాజు రామునికి ముత్తాత అని. 

   స్మార్తులు చెబుతున్నది  తప్పు

రాముని తండ్రి దశరథుడు,  రాముని తాత (పితామహుడు) అజమహారాజు, రాముని ముత్తాత (ప్రపితామహుడు) నాభాగమహారాజు...

నాభాగమహారాజవర్మణే నప్త్రే అని చెప్పాల్సి ఉండగా రఘుమహారాజవర్మణే  అని చెబుతున్నారు


సీతాదేవికి చంద్రవంశోద్భవీం అని చెప్తున్నారు.  కానీ సీతాదేవి చంద్రవంశానికి చెందినది కాదు. మిథి వంశానికి చెందినది. కనకనే మైథిలీ అనికూడా పిలువబడుతుంది. మిధి చంద్రవంశానికి చెందినవాడు కాదు. మిధిజన్మకి కారణం నిమియొక్క శరీరం. అంటే మృతకళేబరాన్ని మధించి ఋషులు పుట్టించారు.  గౌతముడు అలా యాగభూమిలో పుట్టించిన కారణంగా గౌతముడు మిధికి గోత్రప్రవర్తకుడయ్యాడు. చంద్రవంశానికి చెందినది అని ఎలా చెబుతున్నారు...? 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి