గీతామృత వాణి 1

భగగవద్గీత మహాభారత సారాంశం.

ఏది ధర్మం ఏది అధర్మం అనేది విపులంగా అందించింది మహాభారతం.  

తమకు సంబంధించిన హక్కులు కాపాడుకోవడం తాముచేయవలసిన కర్తవ్యములను చక్కగా నిర్వర్తించడం ధర్మం. 


ధర్మాన్ని గెలిపించుకునేందుకు ప్రతిమానవుడూ ప్రయత్నం చేసితీరాలి. లేకపోతే అధర్మపరుల ఆగడాలు మితిమీరి సమాజానికి హానికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ధర్మవర్తనుల కార్యములను స్వార్ధపరులైన అధర్మపరులు తమ కుయుక్తులతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ధర్మం తెలిసినవారు చెప్పాలి. లేదా ధర్మాన్ని గెలిపించుకునేందుకు శక్యిమేరకు కృషి చేయాలి. 

అధర్మపరులు తమ స్వార్ధం సాధించుకోవడానికి అధర్మమే ధర్మమని నిరూపించడానికి అనేకరకాలుగా ప్రయత్నం చేస్తారు. పైగా తామాచరించినదే ధర్మమని నిరూపించడానికి ప్రయత్నం చేస్యారు. 

అలాంటి అధర్మపరులుకు ప్రతీక ధృతరాష్ట్రుడు.  చూడండి వీడియో 


కామెంట్‌లు