నరకచతుర్దశి  ఎలా చేయాలి...? 

నరకమును పోగొట్టేది కనుక నరకచతుర్ధి

ప్రాతఃకాలం అనగా సూర్యోదయం కాకముందే నువ్వులనూనె తలకు ఒంటికీ పూసుకుని తరువాత తలస్నానం చేయాలి. 

శీతలోష్ణసమాయుక్త  సంకటక దశాన్విత ।

హర పాపం అపామార్గ భ్రామ్యమాణః పునః పునః ।।

 అను మంత్రముతో ఉత్తరేణు కొమ్మను స్నానం మధ్యలో తలచుట్టూ త్రిప్పాలి. స్నానం తరువాత బొట్టు పెట్టుకోవడం... తరువాత సంధ్యావందనం కార్తీక మాస స్నానం చేయాలి. తరువాత యమతర్పణం ఈక్రింది మంత్రముతో నువ్వులూ నీరు కలిపి దక్షిణవైపు తిరిగి క్రింది మంత్రాలతో కూడా తర్పణం ఇవ్వాలి... 

 ముఖ్య గమనిక : తండ్రి జీవించి ఉంటే వేల్లచివరలనుండి (దేవతర్పణంవలే) ఇవ్వాలి. తండ్రి గతించినవారు బొటకనవ్రేలు చూపుడు వ్రేలుకి మధ్యలోనుండి (పిత్రుతర్పణంవలె) తర్పణం ఇవ్వాలి. 

యముయనమః #యమం #తర్పయామి 

ధర్మరాజాయ నమః యమం తర్పయామి 

 మృత్యువే నమః యమం తర్పయామి

 అంతకాయ నమః యమం తర్పయామి 

 వైవస్వతాయ నమః యమం తర్పయామి 

 కాలాయ నమః యమం తర్పయామి  

సర్వభూత క్షయాయ నమః యమం తర్పయామి  

ఔదంబరాయ నమః యమం తర్పయామి 

 దధ్యా నమః యమం తర్పయామి 

 నీలాయ నమః యమం తర్పయామి 

 పరమేష్ఠినే నమః యమం తర్పయామి 

 వృకోదరాయ నమః యమం తర్పయామి 

 చిత్రాయ నమః యమం తర్పయామి 

 చిత్రగుప్తాయ నమః యమం తర్పయామి 

 ఇలా తర్పణం ఇవ్వాలి. సాయంకాలం ప్రాకారములయందు, మఠములయందు, దేవాలయములయందు దీపములుంచవలెను. 

అదే విధంగా ఉల్కాదానం కూడా (ఆముదపు కాడలకు ప్రత్తి చుట్టి నూనె తో తడిపి వెలిగిస్తే ఉల్కలవలే పడును ఇదే ఉల్కాదానం) #ఇలా #మూడుదినములు చేయవలెను. #దీపదానం వేరు అది ఎలా ...? ... ఇంకొక పోష్టు లో విన్నవిస్తాను ఇతరమతాలను నిందించుట వలన ప్రరయోజనం ఉందో లేదో కానీ... మన మతధర్మాలు ఆచరించడం ఉత్తమం అని అనుకుంటాను...!

 ---------------------------------------------------------

 నచ్చిన వారు షేర్ చేయండి . షేర్ కుదరకుంటే కాపీ పేస్టు చేయవచ్చు ... 

 ఇట్లు ... వ్యాఖ్యాన వాచస్పతి, ప్రవచన సుధానిధి ఇత్యాది బిరుదాంకితః, భాగవతబ్రాహ్మణ పాదదాసః... #ఆర్షవాణి #సంప్రదాయ #ప్రచారపీట స్థాపితో శ్రీమాన్ జనార్దన రామానుజదాసః ( ప్రస్తుత సివిని నామ గ్రామవాసః, డోలమడ గ్రామ సంభూతః)

కామెంట్‌లు