ధనుర్మాసం అంతా విష్ణు సంబంధమైన ఆలయాల్లో
వేణుపొంగలి నోటికింపైన ప్రసాదం ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ఠమైనది.
అలవాటు పడితే మరలా మరలా కావాలని అనిపించేది
తిరుప్పావై గానం చెవికి ఇంపైన ప్రసాదం మనస్సుకి బలమిచ్చి ఆత్మను బలవర్ధకమైనదిగా చేసి భగవంతునికి చేరుగా చేసేదే తిరుప్పావై
తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని ఆచరించితే వివాహం ఔతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సమస్త కళ్యాణములూ కలుగుతాయి.
కనుకనే భారతీయ సనాతన సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు.
పల్లె గ్రామాలలో పూర్వం అత్యంత శ్రద్ధగా కోలాహలంగా చేసేవారు. ఇప్పుడు (అ)నాగరికత పెరిగి అలాంటివి మరచిపోయారు.
వ్రత విధానం
ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి.
తరువాత గోదారంగనాథుల అష్టోత్తరాలతో పూజించాలి (షోడశోపచారపూజ) నైవేద్యంగా వేణుపొంగలి సమర్పించాలి.
తరువాత గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై దివ్యప్రబంధపారాయణ చేసుకుంటాం. ఆతరువాత అందరూ కలసి వరుసగా కూర్చుని తీర్థం ప్రసాదం స్వీకరించాలి.
ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయి.
వారణమాయిరమ్ పారాయణచేస్తే వివాహం ఆలస్యమైనవారికి వివాహమౌతుంది.
ధనస్సురాశిలో సూర్యుడు ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం .వ్రతం ప్రారంభం కాగా
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి రోజుకి ఒక రోజు ముందు భోగి తో ధనుర్మాసం ముగుస్తుంది.
వ్రతనియమాలు ముగించుకుని గోదారంగనాథుల కళ్యాణం జరుపుకొనుటచేత సమస్త భోగములను ఇచ్చేది కనుక దానిని భోగి పండగ అంటారు.
ప్రత్యేక కార్యక్రమాలు
ముక్కోటి ఏకాదశి, భోగి, సంక్రాంతి.
ధనుర్మాసం లో వచ్చిన శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, శ్రీరంగాది వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి