యమద్వితీయ
అపమృత్యు భయము తొలగించేది...
సోదరికి సౌభాగ్యం ఇచ్చేది !
సోదరీ సోదరలమధ్య అన్యోన్య అనురాగం కలిగించేది ...! దీనినే సోదరి ద్వితీయ అంటారు...
శ్లోకం : యమో యమునయా పూర్వం భోజితః స్వగృహే పూర్వం ।
అతో యమద్వితీయా సా ప్రోక్తా లోకే యుధిష్టర ।।
దీపావళి తరువాత వచ్చిన శుద్ధ ద్వితీయనాడు.. యముడు తన సోదరి యైన యమున ఇంటికి వెల్లాడు ... .! అన్నయ్య వచ్చాడని పరమ ప్రేమతో భోజనం పెట్టింది యమున....! భోజనం చేసిన యముడు చెల్లెలుతో "అమ్మా! ఏం కావాలి చెప్పు ఇస్తాను" అన్నాడు. అప్పుడు యమున అని కోరింది. అప్పుడు యముడు "అలాగేమ్మా, కార్తీకమాస శుక్లపక్ష విదియనాడు ఏ సోదరుడు, అక్కచెల్లెళ్లు ఇంటికి వెళ్లి అన్నం తింటాడో ఆ అన్నయ్యకు అపమృత్యుదోషం ఉండదు. సోదరికి వైధవ్యము రాదు. సోదరీ సోదరుల మధ్య అన్యోన్య అనురాగం వర్ధిల్లును. రాబోయే జన్మలో కూడా సోదర అనురాగంతో సంపదలతో వర్ధిల్లుదురు " అని అని వరమిచ్చాడు....! కనుక ఈ దినమందు యమునానదిలో స్నానం చేసినట్లు భావిస్తూ స్నానం చేసి యమునికి చిత్రగుప్తునికి పూజించడం దక్షిణ దిశగా యమతర్పణం విడుచుట ... తరువాత కాళ్లూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి సోదరి (అక్క లేదా చెల్లి ) వడ్డించిన భోజనం భుజించాలి. తరువాత సోదరికి చేతనైనంతవరకూ సన్మానంగా ధనమో ఆభరణములో వస్త్రాలో ధాన్యమో.. మొదలగునవి ఇవ్వ్వాలి . అందుకే దీనిని "సోదరి ద్వితీయ" అని పిలుస్తారు..... ! యమీ యములు సూర్యుని సంతానం ... సూర్యుడు నారాయణుడే... అందుచేత నారాయణాంశే యముడు కూడా... కనుక వీలుకానివారు శ్రీమతే నారాయణాయనమః అను మంత్రాన్ని జపిస్తూ ఈ పైవిషయాన్ని స్మరించడం వలన కొంత ఫలితం ఉంటుంది. --
నచ్చిన వారు షేర్ చేయవచ్చు . షేర్ కుదరకుంటే కాపీ పేస్టు చేయవచ్చు ... .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి