గోవు లక్ష్మీ స్వరూపం

లక్ష్మీ దేవిని సురభి అని కూడా పూజిస్తాం.  
ఎద్దులనూ పూజించుటచేత గో ధన ధాన్య ములు వృద్ధి పొందుతాయి.

లక్ష్మీ దేవివల్లనే సమస్త భువనములూ సృష్టించబడినాయి. కనుకనే లక్ష్మీ దేవిని భువనేశ్వరి అని  లక్ష్మీ అష్టోత్తరశతనామాలలో కీర్తించారు ...! అలాంటి లక్ష్మీ దేవిని సురభి అని కూడా పూజిస్తాం.  దేవతలను  పోషించడం కోసం సుభి అయ్యింది అమ్మ. కనుక  గోవు లక్ష్మీ అంశతో జన్మించింది. 

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధాసహచరీం పరాం
గవామధిష్ఠాతృ దేవీం గవాద్యాం గవాం ప్రసూం  (దేవీభాగవతం 9వ స్కందం)
అని కీర్తించారు.  ఇందులో గోవును లక్ష్మి స్వరూపంగానే చెప్పారు. 

లక్ష్మీ దేవిని "ఓం సురభ్యైనమః" అనే షడక్షరమంత్రంతో ఆరాధన చేస్తే బుద్ధి సమృద్ధి కూడా లభిస్తుంది అని మంత్రశాస్త్రవచనం. అందుచేతనే లక్ష్మీ అష్టోత్తరశతనామాలలో ఈ మంత్రం కనిపిస్తుంది .

అలాంటి సురభి నుండే ఆవులు ఎద్దులు అనేకం ఉత్పన్నం ఐనాయి.  అందుచేతనే ... గోసంతతి ఐన ఆవులను ఎద్దులనూ పూజించుటచేత గో ధన ధాన్య ములు వృద్ధి పొందుతాయి.

గరుడపురాణంలో...

గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ
తస్మాద్ధేను పూజనేన ప్రీయతాం కమలాపతిః 

గోవు శరీరములో పద్నాలుగు భువనాలూ ఉంటాయి కనుక  గోవును పూజించుటచేత విశ్వాత్మకుడైన విష్ణువు (కమలాపతి = లక్ష్మీదేవి భర్త) సంతోషిస్తాడు. 

యాలక్ష్మీః సర్వభూతానాం యాచదేవే వ్యవస్థితాః
దేను రూపేణ సాదేవి మమపాపం వ్యపోహతు
 ఈ దేనువు లక్ష్మీదేవి  . ఈ లక్ష్మీ దేవివల్లనే సర్వ ప్రాణులూ జీవిస్తున్నాయి. అటువంటి లక్ష్మీ స్వరూపమైన ధేనువు నాపాపములు పోగోట్టుగాక...!

ధర్మసింధు 

క్షీరోదార్ణవ సంభూతే సురాసురైః నమస్కృతే 
సర్వదేవమయే దేవి గృహాణార్ఘ్యం నమోస్తుతే
క్షీర సముద్రమునుండి పుట్టిన తల్లీ ! దేవతలచే రాక్షసులచే కూడా నమస్కరించబడేదానా...! సర్వదేవతా స్వరూపిణీ అర్ఘ్యమును స్వీకరించుము అని. గోపూజాసమయంలో ధర్మసింధు ఇలా అంటుంది... దీనిని బట్టి గోవు లక్ష్మీ దేవియే అని స్పష్టం 

గోవు లక్ష్మీ స్వరూపం అని పై ప్రమాణ వాక్యాలు చెబుతుండగా లక్ష్మీ దెవిని అవమాంచాయని ప్రముఖ స్మార్త ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం ఎంత అసమంజసమో విజ్ఞత కలవారుమాత్రమే గుర్తించగలరు. 

లక్ష్మీ దేవిని విష్ణువనీ అవమానించడమే ప్రధానమైనవిధంగా తప్పుడు కథలు ప్రచారంచేసే ఈ స్మార్తులను బ్రాహ్మణులు అని ఎలా అనుకుంటున్నారు? 

ఇలాంటి బ్రహ్మ ద్వేషులను ఇంకా గుర్తించకుండా ఇలాంటి నీచులకు గోదానంచేస్తే....పాపమే వస్తుంది తప్పు పుణ్యము రాదని గరుడపురాణంలో చెప్పబడింది.  చూడండి...

గోదానం అపాత్రునికి దానంచేయడంవలన 
దాత దానం పుచ్చుకున్నవాడు కూడా 
పాపాన్ని పొంది అధోగతి పాలౌతారు. 

అన్ని దానములలోకన్నా గోదానం శ్రేష్ఠమైనది.  ఐతే అలాంటి గోదానము బ్రాహ్మణునికి మాత్రమే ఇవ్వాలి. 
బ్రాహ్మణుడు  అంటే అది కులంకాదు. ఏకులంలో పుట్టినా శ్రీమన్నారాయణని మాత్రమే పరదైవమని ఉపాసించువారు మాత్రమే బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులలో ఆచారము కలవారినే ఆచార్యులు అంటారు. అలాంటి ఆచార్యులు  శ్రేష్ఠమైనవారు. అలాంటి వారిలో అందరికీ విద్య తపస్సు ఉండకపోవచ్చు.  కానీ అలాంటి విద్య తపస్సు కలవారు లభిస్తే అలాంటి వారికి దానం చేయడం మరింత శ్రేష్ఠమైనది.    

శ్రీమన్నారాయణుడే పరదైవమని శంకరులు రామానుజులు మధ్వాచార్యులు కూడా తమతమ ప్రస్తానత్రయభాష్యంలో చెప్పగా...

శంకరులు ఆ ప్రస్తానత్రయభాష్యంలో  శివుడు శక్తి లాంటి దేవతలసలు 
లేనే లేరని అద్వైతముగా ఖండించారు. 

 కేవలం బ్రాహ్మణునికి పుట్టి బ్రాహ్మణులుగా లోకములో చెప్పుకొనే వారు
 నామమాత్రంగా  తప్ప... నిజమైన బ్రాహ్మణులు కాదని సర్వత్రా చెప్పబడుతోంది. 

కామెంట్‌లు